అనకాపల్లి టౌన్ : స్థానిక ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న కండక్టర్, డ్రైవర్లపై సస్పెన్షన్ వేటు ఎత్తి వేయాలని ఎన్‌ఎంయూఏ జోనల్ జాయింట్ సెక్రటరీ జి. శంకరావు డిమాండ్ చేశారు. 13వ రోజు రిలే నిరాహార దీక్షలో భాగంగా గురువారం భోజన విరామ సమయంలో కార్మికు లు, ఆర్టీసీ డిపో ముందు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్‌ఎంయూఏ జోనల్ అధ్యక్షుడు ఏఎన్ రావు, కార్యదర్శి కె.ఎన్ .వి.రమేష్, రీజనల్ కార్యదర్శి పి.సుధాకర్, కె.సునీత, ఎన్.లక్ష్మి, పీఆర్ లక్ష్మి, సంతోషి పాల్గొన్నారు.