ఇఫ్తార్ సహర్ మంగళ బుధ
అనకాపల్లి 6.10 4.53 నర్సీపట్నం 6.12 4.51
నర్సీపట్నం: ఇచ్చిన హామీల సాధనకు శాంతియుత నిరసన తలపెట్టిన అంగన్‌వాడీ కార్యకర్తలను ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్న ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అడిగర్ల రాజు పేర్కొన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తల అక్రమ అరెస్టులను ఖండిస్తూ సిటు ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కార్యకర్తలు ఎన్టీఆర్ స్టేడియం నుంచి ర్యాలీగా బయలుదేరి ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని ఆందోళనకు దిగారు. ధర్నాను ఉద్దేశించి రాజు మాట్లాడుతూ.. గత సమ్మె కాలంలో అంగన్‌వాడీలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ విజయవాడ వెళ్తున్న కార్యకర్తలను నిర్బంధించడాన్ని ఖండిస్తున్నామన్నారు. వేతన సమస్యను పరిష్కరించకుండా, వయసు రెండేళ్లు పెంచి గతంలో అంగీకరించని, సరైన విధానం లేని గ్రాట్యుటీని అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం అంగన్‌వాడీలను మోసగించడమేనన్నారు. గౌరవ వేతనం ఇస్తూ ప్రభుత్వ ఉద్యోగులుగా చూపుతున్నారని, వారి కుటుంబాల్లోని వికలాంగులు, ఒంటరి మహిళలకు పెన్షన్ ఇవ్వడం లేదన్నారు. రేషన్ కార్డులు తొలగించడంతో అంగన్‌వాడీలు ఆరోగ్యశ్రీకి నోచుకోలేదన్నారు. నర్సీపట్నం, గొలుగొండ ప్రాజెక్టుల నాయకులు వి.సామరాజ్యం, పి.వరలక్ష్మి, ఆర్.కృష్ణవేణి, రమణమ్మ, హైమా, శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.
అంగన్‌వాడీల నిర్బంధంపై నిరసన హోరు