తాటి చెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

తాటి చెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి

May 15 2026 10:20 AM | Updated on May 15 2026 10:20 AM

చీడికాడ: మండలంలోని జి.కొత్తపల్లి శివారు చినగోగాడకు చెందిన ఒక వ్యక్తి ప్రమాదవశాత్తూ తాటిచెట్టుపై నుంచి జారి పడి మృతి చెందినట్లు ఎస్‌ఐ బి.సతీష్‌ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కోన నారాయణమూర్తి(43)గురువారం మధ్యాహ్నం తమ కల్లం సమీపంలో తాటికాయలు కోసేందుకు తాటిచెట్టు ఎక్కాడన్నారు. ప్రమాదవశాత్తూ కాలుజారి చెట్టు పైనుంచి కిందికి పడిపోవడంతో తలకు,శరీరంపై బలమైన గాయాలై మృతి చెందాడన్నారు. ఘటనపై మృతుని భార్య వెంకట వరలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించినట్టు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement