రోలుగుంట: మండలంలోని కె.అడ్డసరం గ్రామానికి చెందిన ఆదివాసీలు తమ భూ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రిలే దీక్షలు గురువారం చేపట్టారు. గతంలో కె.అడ్డసరం రెవెన్యూ గ్రామంలో ఖాతా నెంబర్ 559లో భూములను ఫోర్జరీ వారసత్వ ధ్రువపత్రంతో రాయివరపు చంద్రశేఖరరావు పేరున మార్చారు. తహసీల్దార్ డిజిటల్ సంతకంతో ఆన్‌లైన్‌లో నమోదు కావడంతో సాగుదారులైన గిరిజనులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీనిపై కలెక్టర్ విచారణ చేపట్టి తహసీల్దార్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, చంద్రశేఖరరావుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. భూముల హక్కు పత్రాలపై తహసీల్దార్ డిజిటల్ సంతకం రద్దు చేసే వరకూ రిలే దీక్షలు కొనసాగుతాయని కె.అడ్డసరం ఆదివాసీలు, కొంతలం ఓబీసీ రైతులు తేల్చిచెప్పారు. జాయింటు కలెక్టర్ కోర్టులో ఆర్వోఆర్ అపీల్‌పై ఆర్డరు వచ్చేంత వరకూ తమ జోలికి రావ్వొద్దని కోరారు. కార్యక్రమంలో ఆదివాసీ సంఘం జిల్లా కార్యదర్శి మూసూరి రాజు, కేదారి దేవి, వెంగళరావు సత్య, తుర్రి నూకరాజు, అర్జున్ పాల్గొన్నారు.


