మహారాణిపేట: ‘నా బిడ్డను అత్యంత క్రూరంగా హత్య చేశాడు. ఈ కష్టం పగవారికి కూడా రాకూడదు’అంటూ మౌనిక తండ్రి పొలిపల్లి వేణుగోపాల్ కన్నీటిపర్యంతమయ్యారు. మంగళవారం కేజీహెచ్ మార్చురీ వద్ద తన కుమార్తె మృతదేహాన్ని చూసి ఆయన బోరున విలపించారు. తన కుమార్తెను హత్య చేసిన చింతాడ రవీంద్రను ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. హత్య జరిగిన సమయంలో మౌనిక ఒంటిపై ఉన్న సుమారు రెండు తులాల బంగారు ఆభరణాలు మాయమయ్యాయని వేణుగోపాల్ తెలిపారు. ఈ కేసుపై ప్రభుత్వం, పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించి, తమ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని వేడుకున్నారు.


