పుస్తక పఠనంతో విజ్ఞానం | - | Sakshi
Sakshi News home page

పుస్తక పఠనంతో విజ్ఞానం

Mar 31 2026 8:26 AM | Updated on Mar 31 2026 8:26 AM

డుంబ్రిగుడ: మండలం కేంద్రంలోని శాఖ గ్రంథాలయంలో ఉమ్మడి జిల్లాల చైర్మన్‌ వన్నెంరెడ్డి సతీష్‌ సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు, పాఠకులను అడిగి గ్రంథాలయంలో గల సౌకర్యలపై ఆరా తీశారు. శాఖ గ్రంథాలయంలో కావలసిన అవసరాలను గురించి గ్రంథాలయ అధికారి సునీతకు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు కొత్తగా వచ్చిన పుస్తకాలు కొనుగోలు చేయమని కోరారు. పుస్తక పఠనం అలవర్చుకోవాలని, దీంతో విస్తృతంగా విజ్ఞానం పొందవచ్చన్నారు. వైఫై సేవలు ఆధునీకరణ చేస్తామని చైర్మన్‌ అన్నారు. పాఠకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement