దళితుల భూ సమస్యల పరిష్కారానికి కృషి | - | Sakshi
Sakshi News home page

దళితుల భూ సమస్యల పరిష్కారానికి కృషి

Mar 30 2026 8:30 AM | Updated on Mar 30 2026 8:30 AM

రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ సభ్యుడు సీతారాం

నర్సీపట్నం: అన్యాక్రాంతమైన దళితుల భూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ సభ్యుడు రావాడ సీతారాం పేర్కొన్నారు. గొలుగొండ మండలం జోగంపేట గ్రామంలో ఆదివారం ఆయన పర్యటించి దళితల భూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాండవ నిర్వాసితులమైన తమకు కోటవురట్ల మండలం పందూరు గ్రామంలో అసైన్డ్‌ భూములు ప్రభుత్వం ఇచ్చిందని బాధిత దళిత రైతులు కమిషన్‌ సభ్యుడి దృష్టికి తీసుకువెళ్లారు. ఏ సంబంధం లేని పెత్తందారులు తమ భూముల్లో ఫలసాయాన్ని అనుభవిస్తున్నారని వాపోయారు. రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని వివరించారు. దీనికి సీతారాం స్పందిస్తూ కమిషన్‌ చైర్మన్‌ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అనంతరం బాలుర గురుకుల కళాశాల, పాఠశాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. ఎస్సీ కార్పొరేషన్‌ స్టేట్‌ డైరెక్టర్‌ కె.మరిడియ్య, గురుకుల పాఠశాల విద్యా కమిటీ చైర్మన్‌ చిట్ల చతపతిరావు, తహసీల్దార్‌ కె.నూకరాజు, ఎంపీడీవో శ్రీనువాసరావు, ఎస్సై రామారావు, రుషికేశ్వరరావు, ఏఎస్‌డబ్ల్యూవో బాబూరావు, డీహెచ్‌పీఎస్‌ నాయకులు డీసీహెచ్‌ రాజు, డీవీఎంఎస్‌ సభ్యులు సహదేవుడు, ఈరెల్లి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement