ప్రమాద స్థలంలో లోకేష్ మృతదేహం
మాకవరపాలెం: మండలంలోని తామరం వేంకటేశ్వర ఆలయ సమీపంలో శనివారం అర్ధరాత్రి లారీ ఢీకొని యువకుడి దుర్మరణం చెందాడు. విజయనగరం జిల్లా ఎస్.కోటకు చెందిన చింతాడ లోకేష్(25) కశింకోట మండలం సుందరయ్యపేటలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అతడు తన మోటార్ సైకిల్‌పై మాకవరపాలెం వైపు వస్తున్నాడు. అదే సమయంలో నర్సీపట్నం నుంచి తాళ్లపాలెం వైపు ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో లోకేష్ తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై లోకేష్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ దామోదర్‌నాయుడు ఆదివారం తెలిపారు. లారీని పట్టుకున్నామన్నారు.


