మరికొంతకాలం ప్రత్యేక రైళ్లు | - | Sakshi
Sakshi News home page

మరికొంతకాలం ప్రత్యేక రైళ్లు

Mar 30 2026 8:30 AM | Updated on Mar 30 2026 8:30 AM

తాటిచెట్లపాలెం: వేసవి సీజన్‌లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లను మరో మూణ్నెల్ల పాటు పొడిగిస్తున్నట్లు వాల్తేర్‌ డివిజన్‌ సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ కె.పవన్‌కుమా ర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

● విశాఖపట్నం –షాలిమర్‌ (08508) స్పెషల్‌ రైలు ప్రతి మంగళవారం విశాఖపట్నంలో ఉదయం 11.20 గంటలకు బయల్దేరి మరుసటిరోజు తెల్ల వారు 3 గంటలకు షాలిమర్‌ చేరుకుంటుంది. ఈ రైలును జూన్‌ 30 వరకు పొడిగించారు. షాలిమర్‌–విశాఖపట్నం (08507) స్పెషల్‌ ప్రతీ బుధవారం షాలిమర్‌లో తెల్లవారుజాము 5గంటలకు బయల్దేరి అదే రోజు రాత్రి 8.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైలును జూలై 1వ తేదీ వరకు పొడిగించారు.

● సంబల్‌పూర్‌– ఈరోడ్‌ (08311) వీక్లీ స్పెషల్‌ ప్రతి బుధవారం సంబల్‌పూర్‌లో ఉదయం 11.35 గంటలకు బయల్దేరి అదే రోజు రాత్రి 9.30 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ్నుంచి 9.32 గంటలకు బయల్దేరి మరుసటిరోజు రాత్రి 10.50 గంటలకు ఈరోడ్‌ వెళ్తుంది. ఈ రైలును మే 27వ తేదీ వరకు పొడిగించారు. ఈరోడ్‌–సంబల్‌పూర్‌ (08312) వీక్లీ స్పెషల్‌ను మే 29వ తేదీ వరకు పొడిగించారు. ఈ రైలు ఈరోడ్‌లో ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2.35గంటలకు బయల్దేరి మరుసటిరోజు మధ్యాహ్నం 1.08 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ్నుంచి 1.10 గంటలకు బయల్దేరి శనివారం రాత్రి 11.15 గంటలకు సంబల్‌పూర్‌ వెళ్తుంది.

● భువనేశ్వర్‌–యశ్వంత్‌పూర్‌(02811) వీక్లీ ఏసీ స్పెషల్‌ను జూన్‌ 27వ తేదీ వరకు పొడిగించారు. ఈ రైలు ప్రతి శనివారం భువనేశ్వర్‌లో రాత్రి 7.15 గంటలకు బయల్దేరి మరుసటిరోజు తెల్లవారు 1.53 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 1.55 గంటలకు బయల్దేరి సోమవారం తెల్లవారుజాము 12.15 గంటలకు యశ్వంత్‌పూర్‌ వెళ్తుంది. యశ్వంత్‌పూర్‌–భువనేశ్వర్‌ (02812) వీక్లీ ఏసీ స్పెషల్‌ను జూన్‌ 29వ తేదీ వరకు పొడిగించారు. ఈ రైలు ప్రతి సోమవారం తెల్లవారుజాము 4.30 గంటలకు బయల్దేరి అదే రోజు రాత్రి 10.53 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 10.55గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 6గంటలకు భువనేశ్వర్‌ వెళ్తుంది.

● యశ్వంత్‌పూర్‌–కతిహార్‌(06571) వీక్లీ ఏసీ స్పెషల్‌ను జూలై 14వ తేదీ వరకు పొడిగించారు. ఈ రైలు ప్రతి మంగళవారం యశ్వంత్‌పూర్‌లో ఉదయం 7 గంటలకు బయల్దేరి మరుసటిరోజు తెల్లవారుజాము 5 గంటలకు విజయనగరం చేరుకుంఉటంది. అక్కడి నుంచి 5.10 గంటలకు బయల్దేరి గురువారం తెల్లవారుజాము 4.30గంటలకు కతిహార్‌ వెళ్తుంది. కతిహార్‌–యశ్వంత్‌పూర్‌ (06572) వీక్లీ ఏసీ స్పెషల్‌ను జూలై 17వ తేదీ వరకు పొడిగించారు. ఈ రైలు ప్రతి శుక్రవారం తెల్లవారుజాము 5.15 గంటలకు బయల్దేరి మరుసటిరోజు తెల్లవారుజాము 3.40 గంటలకు విజయనగరం చేరుకుంటుంది. అక్కడ నుంచి 3.50 గంటలకు బయల్దేరి మరుసటిరోజుఉదయం 4గంటలకు భువనేశ్వర్‌ వెళ్తుంది.

● ఎస్‌ఎంవీ బెంగళూరు–మాల్డా టౌన్‌(06565) స్పెషల్‌ రైలును జూలై 12వతేదీ వరకు పొడిగించారు. ఎస్‌ఎంవీ బెంగళూరులో ఈ రైలు ప్రతి ఆదివారం రాత్రి 11.40 గంటలకు బయల్దేరి మరుసటిరోజు సాయంత్రం 6.13 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 6.15గంటలకు బయల్దేరి మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు మాల్డా టౌన్‌ వెళ్తుంది. మాల్డా టౌన్‌– ఎస్‌ఎంవీ బెంగళూరు(06566) స్పెషల్‌ను జూలై 15వ తేదీ వరకు పొడిగించారు. ఈ రైలు బుధవారాల్లో సాయంత్రం 4గంటలకు మాల్డా టౌన్‌లో బయల్దేరి మరుసటిరోజు మధ్యాహ్నం 3.33గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 3.35గంటలకు బయల్దేరి మరుసటిరోజు శుక్రవారం మధ్యా హ్నం 12.45 గంటలకు ఎస్‌ఎంవీ బెంగళూరు వెళ్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement