క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం | - | Sakshi
Sakshi News home page

క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం

Mar 26 2026 7:40 AM | Updated on Mar 26 2026 7:40 AM

అనకాపల్లి: క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యంతో పాటు శారీరక దారుఢ్యం చేకూరుతుందని జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి పూజారి శైలజ అన్నారు. మండలంలో ఏఎంఎఎల్‌ కళాశాల క్రీడామైదానంలో సంస్థ ఆధ్వర్యంలో బుధవారం మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడల వల్ల మానసిక ఒత్తిడి నుంచి విముక్తి కలుగుతుందన్నారు. అనంతరం 100, 400, 800, 1500 మీటర్ల రన్నింగ్‌, లాంగ్‌జంప్‌, హైజంప్‌, త్రోబాల్‌, డిస్క్‌త్రో తదితర పోటీలను నిర్వహించారు. జిల్లా స్థాయి పోటీల్లో ఎంపికై న క్రీడాకారులు ఈనెల 30,31 గుంటూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement