రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి
● మాజీ ఎమ్మెల్యే నాగుపల్లి ధనలక్ష్మి డిమాండ్
● బాధిత కుటుంబాలు, క్షతగాత్రులకు పరామర్శ
చింతూరు: బస్సు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ. 20 లక్షల చొప్పున ఎక్స్
గ్రేషియా అందించాలని రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే , వైఎస్సార్‌సీపీ నియోజవర్గ ఇన్‌చార్జి నాగులపల్లి ధనలక్ష్మి డిమాండ్ చేశారు. ఘాట్‌రోడ్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను శుక్రవారం ఆమె చింతూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా ధనలక్ష్మి మాట్లాడుతూ క్షతగాత్రులకు వా రు కోరుకున్న చోట మెరుగైన వైద్యం అందించాలని,ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని కోరారు. మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆమె తెలిపారు. జెడ్పీటీసీ చిచ్చడి మురళి, ఎంపీపీ సవలం అమల, వైస్ ఎంపీపీ మేడేపల్లి సుధాకర్, మండల కన్వీనర్ రామలింగారెడ్డి కో ఆప్షన్ సభ్యుడు జిక్రియా, సర్పంచ్‌లు కారం కన్నారావు, సవలం సత్తిబాబు, మోహన్, రాజు పాల్గొన్నారు.


