జిల్లా విద్యాశాఖాధికారిగా రామకృష్ణారావు
● బాధ్యతల స్వీకరణ
● బ్రహ్మాజీరావుకు పార్వతీపురం
మన్యం జిల్లాకు బదిలీ
సాక్షి,పాడేరు: జిల్లా విద్యాశాఖాధికారిగా రామకృష్ణారావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. విజయనగరం డైట్ కళాశాలలలో సీనియర్ లెక్చరర్‌గా పనిచేస్తున్న ఆయనకు ప్రభుత్వం పదోన్నతి కల్పిస్తూ డీఈవోగా నియమించింది. అలాగే ఇక్కడ డీఈవోగా పనిచేస్తున్న పి.బ్రహ్మజీరావును పార్వతీపురం మన్యం జిల్లా విద్యాశాఖాధికారిగా ప్రభుత్వం బదిలీ చేసింది. బాధ్యతలు స్వీకరించిన రామకృష్ణారావును పాడేరు ఎంఈవో సరస్వతి, ప్రభుత్వ జూనియర్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రమాదేవి, పలు మండలాల ఎంఈవోలు,హెచ్‌ఎంలు,ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు.


