సీలేరు ఎస్‌ఈలుగాబాధ్యతల స్వీకరణ
జాకీర్ హుస్సేన్‌ను సత్కరిస్తున్న అధికారులు
హనుమను కలిసిన జెన్‌కో అధికారులు
సీలేరు: ఏపీ జెన్‌కో సీలేరు కాంప్లెక్స్ ఎస్‌ఈ (సివిల్)గా షేక్ జాకీర్ హుస్సేన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. నెల్లూరులోని దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ కేంద్రం లో పనిచేస్తున్న ఈయనకు ఎస్‌ఈగా పదోన్నతి కల్పిస్తూ ఉన్నతాధికారులు నియమించారు. సీలేరు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు ఎస్‌ఈగా హనుమ బాధ్యతలు స్వీకరించారు. ఈయన పోలవరం ప్రాజెక్టులో ఈఈ విధులు నిర్వహిస్తున్న ఈయనను పదోన్నతిపై నియమించారు. వీరిని జెన్‌ఈ ఈఈలు జైపాల్, భాస్కరరావు, ఏడీ అప్పలనాయుడు తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు.
సీలేరు ఎస్‌ఈలుగాబాధ్యతల స్వీకరణ


