ఇసుక స్టాక్ పాయింట్ల తనిఖీ
స్టాక్ పాయింట్లో ఇసుక నిల్వల రిజిస్టర్లను పరిశీలిస్తున్న ఏడీ ఆనంద్
ఎటపాక: మండలంలోని గుండాలలో రెండు ఇసుక స్టాక్ పాయింట్లను మైనింగ్ శాఖ ఏడీ ఆనంద్ గురువారం తనిఖీ చేశారు. ఇసుక వివరాలను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. రెండు స్టాక్ పాయింట్లను విహారి ఏజెన్సీ లోడర్‌కు అప్పగించామన్నారు. ముందస్తు బిల్లులతో ఆంధ్రాలోని లబ్ధిదారులు ఇసుకను తీసుకోవచ్చని సూచించారు. అనుమతులు లేని వాహనాలను స్టాక్ పాయింట్లలోకి రానీయవద్దని ఆదేశించారు. అనుమతులు లేకుండా తెలంగాణకు ఇసుక రవాణా చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీవో నాగమణి, పోలీస్, మైనింగ్ సిబ్బంది ఉన్నారు.


