‘హైడ్రోపవర్’కు వ్యతిరేకంగా తీర్మానం
గ్రామ సభ తీర్మాన పత్రాన్ని చూపిస్తున్న పంచాయతీ పాలకవర్గం
అరకులోయ టౌన్: మండలంలోని బస్కీ పంచాయతీ దేవరాపల్లి గ్రామంలో హైడ్రోపవర్ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా గురువారం ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. సర్పంచ్ పాడి రమేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పంచాయతీ పరిధిలో ఎక్కడ హైడ్రో పవర్ ప్రాజెక్టుకు సంబంధించి ఎటువంటి పనులు చేపట్టకూడదని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో హైడ్రో పవర్ వ్యతిరేక కమిటీ అధ్యక్షుడు, వైస్ ఎంపీపీ కిల్లో రామన్న, ఆదివాసీ గిరిజన సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్, పీసా కమిటి ఉపాధ్యక్షుడు కిల్లో నూకరాజు, కమిటీ కార్యదర్శి స్వామి, మాజీ సర్పంచ్ స్వాభి బలరాం, నాయకులు దశరథ్, రామారావు, గిరిజనులు పాల్గొన్నారు.


