ఏజెన్సీలో గిరి రైతులకు ప్రధాన ఆదాయ వనరు అయిన కాఫీ తోటలు
మహారాణిపేట (విశాఖ): గృహ నిర్మాణ బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారని పలువురు సభ్యులు ప్రశ్నించారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ చైరపర్సన్ జె.సుభద్ర అధ్యక్షతన జరిగిన స్ధాయి సంఘాల సమావేశంలో వారు మాట్లాడారు. దీనిలో భాగంగా అనంతగిరి జెడ్పీటీసీ డి.గంగరాజు మాట్లాడుతూ ఇళ్లు నిర్మించుకున్న వారికి కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన ఇళ్ల నిర్మాణం పూర్తి చేసినప్పటికీ కూటమి ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడం అన్యాయమని పలువురు సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్ సిలిండర్ల రాయితీ డబ్బులు ఎప్పుడు వేస్తారని పలువురు జెడ్పీటీసీ సభ్యులు ప్రశ్నించారు. ఈకేవైసీ కాకపోవడం, బ్యాంకు ఖాతాలు ఆధార్ కార్డులకు అనుసంధానం జరగని వారికి డబ్బులు జమ కావడం లేదని ఏఎస్‌వో కల్యాణి వివరించారు.
విద్యార్థుల ఆరోగ్యం కాపాడండి
పాడేరు, అరకు ప్రాంతాల్లోని ఆశ్రమ గురుకుల పాఠశాలల్లో గిరిజన విద్యార్థులు ఇటీవల కాలంలో అనారోగ్యంతో చనిపోతున్నారని, వీటిని నివారణకు చర్యలు తీసుకోవాలని అనంతగిరి జెడ్పీటీసీ గంగరాజు డిమాండ్ చేశారు.గురుకుల పాఠశాల్లో పరిశుభ్రమైన నీరు ఇవ్వడం లేదని, దీని వల్ల వారు అనారోగ్యం బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ఇలాంటి పాఠశాలల్లో చదివించేందుకు తల్లిదండ్రులు ఇష్టపడడం లేదని గంగరాజు అన్నారు.
పాడేరు,అరకు ప్రజలపై వివక్ష
అరకు, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలపై కూటమి సర్కార్ వివక్ష చూపుతోందని ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్ విమర్శించారు. ఎక్కడాలేని విధంగా ఈ రెండు నియోజకవర్గాల్లో అమలు చేస్తున్నారన్నారు. మండల లెవెల్ స్టాక్ పాయింట్లు గతంలో జీసీసీలో ఉండేవని, ఇప్పుడు రెవెన్యూకు అప్పగించడం సరికాదన్నారు. ఇతర ఐటీడీఎల పరిధిలో ఎక్కడా ఈ పద్ధతి లేదన్నారు. పాడేరు, అరకులో మాత్రమే ఈ విధానం అమచేస్తున్నారని, ఇక్కడ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఉండటమే కారణమని ఆమె ఆరోపించారు.
ఆశాల నియామకంలో అక్రమాలు
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆశా కార్యకర్తల పోస్టుల నియామకంలో ఎన్నో అవకతవకలు జరిగాయని, అనర్హులకు పోస్టులు ఇచ్చారని అరకు, అనంతగిరి జెడ్పీటీసీలు రోషిణి, గంగరాజు ఆరోపించారు. ఈ పోస్టుల భర్తీలో డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయన్నారు. ఇందులో డీఎంహెచ్‌వో పాత్ర ఉందని, దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గంగరాజు డిమాండ్ చేశారు. నియామకాలను రద్దుచేసి మళ్లీ ఇంటర్వ్యూలు నిర్వహించి భర్తీ చేయాలని వారు అధికారులను కోరారు.
ఇళ్ల బిల్లులు
ఎప్పుడు చెల్లిస్తారు?
ఏజెన్సీలో గిరి రైతులకు ప్రధాన ఆదాయ వనరు అయిన కాఫీ తోటలు


