7 నుంచి రాష్ట్ర స్థాయిఆర్చరీ పోటీలు | - | Sakshi
Sakshi News home page

7 నుంచి రాష్ట్ర స్థాయిఆర్చరీ పోటీలు

Nov 5 2025 8:01 AM | Updated on Nov 5 2025 8:01 AM

7 నుంచి రాష్ట్ర స్థాయిఆర్చరీ పోటీలు

7 నుంచి రాష్ట్ర స్థాయిఆర్చరీ పోటీలు

కలెక్టర్‌ దినేష్‌కుమార్‌

సాక్షి,పాడేరు: జిల్లా కేంద్రం పాడేరులో ఈనెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీలను నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ ఎ.ఎస్‌.దినేష్‌కుమార్‌ తెలిపారు. ఈపోటీల నమూనా, వాల్‌పోస్టర్లను కలెక్టరేట్‌లోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద మంగళవారం కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అండర్‌ 14,17,19 విభాగాలకు సంబంధించి ఏపీ స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతాయన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలకు అల్లూరి జిల్లా అతిథ్యమివ్వడం సంతోషంగా ఉందన్నారు. పాడేరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో జరిగే ఈ పోటీల్లో ఉమ్మడి 13 జిల్లాల నుంచి సుమారు 936 మంది బాలబాలికలు పాల్గొంటారని తెలిపారు. 52 మంది కోచ్‌ మేనేజర్లు, 50 మంది స్థానిక వ్యాయామ ఉపాధ్యాయులు ఈపోటీల నిర్వహణలో భాగస్వామ్యమవుతారని చెప్పారు. పోటీలు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి పి.బ్రహ్మాజీరావు, స్కూల్‌ గేమ్స్‌ జిల్లా కార్యదర్శి పి.సూరిబాబు, మాజీ కార్యదర్శి కొండబాబు, నిర్వాహక కార్యదర్శి భూపతిరాజు, పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement