విద్యార్థినికి గుండె శస్త్ర చికిత్స విజయవంతం
జి.మాడుగుల: స్థానిక ఏకలవ్య పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఎ.లోవకుమారికి గుండె శస్త్ర చికిత్స విజయవంతమైనట్టు ప్రిన్సిపాల్ శివ్‌సింగ్ చౌహాన్ ఒక ప్రకటనలో తెలిపారు.గురుకులం కార్యదర్శి ఎం.గౌతమి చోరవతో విద్యార్థిని ఆరోగ్యం, వైద్య సంరక్షణపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకొనే వారమన్నారు. కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్, పాడేరు ఐటీడీఏ పీవో తురుమణి శ్రీపూజ విద్యార్థిని లోవకుమారిని ఆరోగ్య పరంగా 20రోజులు పాటు ఉండి పూర్తిగా కోలుకోవటానికి సహాయ సహకారాలతో అందించారన్నారు. విద్యార్థిని లోవకుమారికి మెరుగైన గుండె చికిత్స కోసం అక్టోబర్16న విశాఖపట్నంలో మెడికవర్ ఆస్పత్రిలో చేర్చించారు. అక్టోబర్ 27న శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్త యందన్నారు. విద్యార్థిని శస్త్ర చికిత్స అనంతరం నవంబర్ 3న మంచి ఆరోగ్యంతో డిశ్చా ర్చ్ చేశారన్నారు. స్థానిక గురుకులం, ఈఎంఆర్ విద్యార్థుల సంక్షేమం, ఆరోగ్యం, అభివృద్ది పట్ల నిబద్దతను ప్రతిభింభించినట్టు ఆయన తెలిపారు. లోవకుమారి గుండె శస్త్ర చికిత్స కోసం రూ.7.67,000ఆర్థిక సహాయం అందించిన న్యూఢిల్లీలో గల ఎన్‌ఈఎస్‌టీఎస్(నేషనల్ ఎడ్యుకేషన్ సోసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్) ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


