ఆరోగ్య భద్రతపై అవగాహన
● ఏడీఎంహెచ్‌వో సరిత
రాజవొమ్మంగి: మండలంలోని రాజవొమ్మంగి, జడ్డంగి పీహెచ్‌సీలను ఏడీఎంహెచ్‌వో మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్‌వాడీ కేంద్రంలో సిబ్బందికి పలు సూచనలిచ్చారు. పౌష్టికాహారం సక్రమంగా అందేలా చూడాలన్నారు. గర్భిణులు, బాలింతలకు ఆరోగ్యభద్రతపై అవగాహన కల్పించాలన్నారు. అనంతరం రాజవొమ్మంగి, జడ్డంగి పీహెచ్‌సీల్లో తనిఖీలు చేశారు. మందుల స్టాకును పరిశీలించారు. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి అవసరమైన సూచనలు ఇచ్చారు. పీహెచ్‌సీ ఆవరణలోని బర్త్ వెయిటింగ్ రూం చూశారు. ఓపీ రిజిస్టర్, రోగుల వార్డు పరిశీలించారు. అనంతరం రాజవొమ్మంగి శివారు విద్యానగర్ అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించారు. బాలసురక్ష కార్యక్రమంలో భాగంగా గర్భిణులు, బాలింతలు, శిశువుల నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు. మాతా శిశుమరణాలను అరికట్టడం అందరి బాధ్యత అని, వీరికి పౌష్టికాహారం అందించంలో శ్రద్ధతో పనిచేయాలని అంగన్‌వాడీ కార్యకర్తలకు సూచించారు. డాక్టర్ సుష్మ, డాక్టర్ సతీష్‌చంద్ర ఆమె వెంట పాల్గొన్నారు.


