వైద్య కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం
గుంటసీమలో సంతకాలు సేకరిస్తున్న ఎమ్మెల్యే మత్స్యలింగం, ఎంపీ తనూజరాణి
గిడుగు, నాగలితో అరకు ఎంపీ తనూజరాణి, ఎమ్మెల్యే మత్స్యలింగం
డుంబ్రిగుడ: కూటమి ప్రభుత్వ తలపెట్టిన ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుని తీరుతామని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం హెచ్చరించారు. మండలంలోని గుంటసీమలో సర్పంచ్ గుమ్మా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన రచ్చబండ, కోటి సంతకాల సేకరణలో అరకు ఎంపీ డాక్టర్ గుమ్మ తనూజరాణి, ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పార్టీ జెండాలతో రచ్చబండ వరకు కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు.
గిరిజన సంప్రదాయ నాగలి, గిడుగు, విల్లంబులను గిరిజనులు, సర్పంచ్‌లు ఎమ్మెల్యే, ఎంపీలకు అందజేశారు. అనంతరం ఎంపీ తనూజరాణి మాట్లాడుతూ 17 వైద్య కళాశాలల ప్రైవేటీకరణను పూర్తి వ్యతిరేకిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని వైద్య కళాశాలలను ప్రభుత్వం పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలని డిమాండ్ చేశారు. అనంతరం సుభద్ర, భాగ్యలక్షి మాట్లాడుతూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జగన్‌మోహన్‌రెడ్డి 17 వైద్య కళాశాలలను తీసుకువచ్చారని, ఆయనకు పేరువస్తుందన్న భయంతోనే కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంలో ప్రైవేటీకరించేందుకు కుట్రకు తెరలేపిందన్నారు. వైద్యకళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతి రేకిస్తూ సంతకాలను సేకరించారు. ఎంపీపీ బాకా ఈశ్వరి, డుంబ్రిగుడ, అరకులోయ జెడ్పీటీసీలు చట్టారి జానకమ్మ, శెట్టి రోషిణి, మండల పార్టీ అధ్యక్షులు పాంగి పరశురామ్, వైస్‌ఎంపీపీలు శెట్టి ఆనందరావు, పి. లలిత, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు కె.హరి, పోతంగి సర్పంచ్ వి.వెంకటరావు, మండల మహిళ అధ్యక్షురాలు బి.శాంతి, మండల కార్యదర్శులు బి.లీలారాణి, మఠం శంకర్, హెచ్‌బీ రామునాయుడు తదితరులు పాల్గొన్నారు.
అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం హెచ్చరిక
కోటి సంతకాల సేకరణలో పాల్గొన్న అరకు ఎంపీ తనూజరాణి,
జెడ్పీ చైర్‌పర్సన్ సుభద్ర,
మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి
వైద్య కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం


