అధ్వానంగా వన్‌ధన్ వికాస కేంద్రాల నిర్వహణ
● ఆగ్రహానికి గురైన కలెక్టర్ దినేష్‌కుమార్
● వెలుగు సిబ్బందిపై మండిపాటు
డుంబ్రిగుడ: వన్‌ధన్ వికాస కేంద్రాల నిర్వహణ సక్రమంగా లేకపోవడంపై కలెక్టర్ దినేష్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన ఆయన సాగర పంచాయితీలో పర్యటించారు. ఈసందర్భంగా వన్‌ధన్ వికాస్ కేంద్రాలను సందర్శించారు. నిర్వహణ లోపంపై ఆగ్రహించారు. వీడీవీకే సభ్యులకు సరైన అవగాహన లేకపోవడాన్ని గుర్తించిన ఆయన కేంద్రాల్లో నిర్వహిస్తున్న వివిధ రికార్డులు, బ్యాంక్ నిర్వహణ సమచారాన్ని తెలుసుకున్నారు. రూ.లక్షల్లో ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని వెలుగు సిబ్బంది తీరుపై మండిపడ్డారు. తయారు చేస్తున్న బిస్కెట్లను పరిశీలించారు. సాగర పంచాయితీ కుసుమగుడలో నిర్వహిస్తున్న వన్‌ధన్ వికాస్ కేంద్రాన్ని సందర్శించిన ఆయన అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానటరింగ్ జిల్లా కమిటీ సభ్యులు వంతాల దేవదాసు, అరకు సర్పంచ్ జి.శారద, గ్రామస్తులు పాల్గొన్నారు.
అధ్వానంగా వన్‌ధన్ వికాస కేంద్రాల నిర్వహణ


