అన్నవరం బ్రిడ్జి నిర్మించాలని ధర్నా
వీఆర్‌పురం: కొట్టుకుపోయిన అన్నవరం బిడ్జిని తక్షణం నిర్మించాలని డిమాండ్ వైఎస్సార్‌సీపీ, సీపీఎం, కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. భార్షీ వర్షాలకు కొట్టుకుపోవడంతో ఐదు నెలలుగా సుమారు 40 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కూటమి ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ, సీపీఎం, కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్థానికులు సోమవారం బిడ్జి వద్ద ధర్నా చేపట్టారు. నిర్మాణం చేపట్టేవరకు విరమించేది లేదని వారు భీష్మించారు. దీంతో అక్కడికి చేరుకున్న తహసీల్దార్ సరస్వతి, ఎంపీడీవో ఇమ్మానుయేల్, ఎస్‌ఐ సంతోష్‌కుమార్ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో చింతూరు ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్, కలెక్టర్ దినేష్‌కుమార్‌తో వారు ఫోన్‌లో మాట్లాడారు. ఈనెల 10వ తేదీనాటికి బ్రిడ్జి నిర్మాణం చేపడతామని, అప్పటివరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీకి చెందిన సర్పంచ్ పిట్టా రామారావు ఎంపీటీసీ బంధం విజయలక్ష్మి, బంధం రాజు, మడకం కన్నారావు, మొట్టం రమేష్, గుజ్జ రాజేశ్వరి, సీపీఎం నేతలు, ఎంపీపీ కారం లక్ష్మి, సర్పంచ్ పులి సంతోష్, పూనెం సరోజిని, కారం బుచ్చమ్మ, సవలం మారయ్య పాల్గొన్నారు.
ఉన్నతాధికారుల హామీతో విరమణ


