అందుబాటులో 15 యూనిట్ల రక్తం
పాడేరు రూరల్: ఇండియన్ రెడ్ క్రా స్ సొసైటీ అల్లూరి జిల్లా కేంద్రం బ్రాంచి జీజీహెచ్ బ్లడ్ బ్యాంక్‌లో అవసరమైన రక్తం నిల్వ లేకపోవడంతో సంస్థ ప్రతినిధులు తక్షణమే స్పందించా రు. అత్యససరాల వినియోగం కోసం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విశాఖపట్నం జిల్లా బ్రాంచి నుండి బి.పాజిటివ్–5 యూనిట్లు, ఓ.పాజిటివ్–10 యూనిట్లు సేకరించి మంగళవారం పాడేరు జీజీహెచ్ బ్లడ్ బ్యాంక్‌లో అందుబాటులోకి తీసుకువచ్చినట్టు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి గౌరీశంకర్‌రావు తెలిపారు, అవసరమైన వారు వినియోగించుకోవాలని ఆయన కోరారు.


