ప్రమాదకర వాగులు దాటొద్దు
జి.మాడుగుల: మండలంలో గ్రామాల మధ్య గల గెడ్డలు, వాగులు మోంథా తుపాను వలన కురిసన వర్షాలకు ప్రమాదకరంగా పొంగి ప్రవహిస్తున్న గెడ్డలు వల్ల ఆయా ప్రాంత ప్రజలు రాకపోకలు, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని తహసీల్దార్ గిడ్డి రాజ్‌కుమార్ తెలిపారు. మండలంలో కుంబిడిసింగి పంచాయతీ కేంద్రానికి పోయే మార్గంలో మంగళవారం వర్షపునీటితో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న గెడ్డను ఆయన పరిశీలించారు. గెడ్డ ప్రవాహా ఉధృతి ఎక్కువగా ఉండడంతో సచివాలయ సిబ్బంది, పోలీస్ అధికారులు సహాయంతో రోడ్డును తాత్కాలికంగా మూసివేశారు. ఆయన మాట్లాడుతూ తుపాను వర్షాల వలన గెడ్డలు పొంగి ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయని గెడ్డలు, వాగులు వాటే ప్రయత్నాలు చేసి ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దని ఆయన సూచించారు.
నాటు పడవల ప్రయాణాలు చేయొద్దు
ముంచంగిపుట్టు: మోంథా తుపాను తగ్గే వరకు నాటు పడవల ప్రయాణాలు మత్స్యగెడ్డ పరివాహక ప్రాంతాల్లో చేయొద్దని ఎస్‌ఐ జె.రామకృష్ణ కోరారు. మండలంలోని సుజనకోట, లక్ష్మీపురం పంచాయతీల్లో మంగళవారం ఎస్‌ఐ రామకృష్ణ పర్యటించి.తుఫాన్ ప్రభావంపై గిరిజనులతో మాట్లాడి అప్రమత్తం చేశారు. తుఫాన్‌తో రెవెన్యూ,పోలీసు,ఆరోగ్య శాఖాల అధికార యంత్రాంగమంతా సహాయక చర్యలు అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు. గ్రామస్తులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి ప్రమాదాలు జరిగిన వెంటనే అధికారులకు తెలియజేయాలని, తుఫాన్ తగ్గేంత వరకు ప్రజలంతా అధికారులకు సహకారించాలని ఆయన కోరారు.
ప్రమాదకర వాగులు దాటొద్దు


