లబ్బూరు ఏకలవ్యలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు
● రూ.40లక్షలతో నీటి సౌకర్యం
కల్పనకు ప్రతిపాదనలు
● ఏపీ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల కన్సల్టెంట్ కృష్ణారావు
ముంచంగిపుట్టు: లబ్బూరు ఏకలవ్య పాఠశాలలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోనున్నట్టు ఏపీ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల కన్సల్టెంట్ జి.కృష్ణారావు తెలిపారు. మండలంలోని జోలాపుట్టు పంచాయతీ లబ్బూరు ఏకలవ్య మోడల్ రెసిడిన్షియల్ పాఠశాలను సోమవారం కన్సల్టెంట్ కృష్ణరావు,నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ప్రతినిధులు సందర్శించారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలపై ఆరా తీశారు. నీటి ఎద్దడి, ప్రహారి,అసంపూర్తి భవనాల సమస్యలు విద్యార్థులు వారి దృష్టికి తీసుకెళ్లారు. సమీప గ్రామాల విద్యార్థుల తల్లిదండ్రులు కృష్ణారావును కలిసి నీటి సమస్యతో పిల్ల లు పడుతున్న ఇబ్బందులను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.40 లక్షలతో ఏకలవ్య పాఠశాలలో తాగునీటి సౌక ర్యం కల్పించేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపనున్నట్టు చెప్పారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను ఉన్నతాధికారులు, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో గురుకులం ఓఎస్డీ మూర్తి, పాఠశాల ప్రిన్సిపాల్ సుమన్, ఎస్‌ఎంసీ కమిటీ చైర్మన్ రామదాసులు పాల్గొన్నారు.


