మోతుగూడెం సీఈ కార్యాలయం వద్ద ర్యాలీ చేస్తున్న అధికారులు, సిబ్బంది
మోతుగూడెం: సర్దార్ వల్లబాయి పటేల్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించే విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా నవంబరు 2వ తేదీ వరకు సెంట్రల్ విజిలెన్స్ కమీషన్ , రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏపీ జెన్‌కో యాజమాన్యం ద్వారా లోయర్ సీలేరు సీఈ కార్యాలయంలో సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ ద్వారా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీఈ కేవీ రాజారావు మాట్లాడుతూ అవినీతి నిర్మూలించడానికి అందరూ కలిసి నిజాయితీగా, పారదర్శకంగా నిబద్దతో పనిచేయాలని, ఉద్యోగం బాధ్యతయుతగా చేస్తానని ప్రతిజ్ఞ చేయించారు. ఎస్‌ఈ చిన కామేశ్వరరావు, ఈఈలు బాలకృష్ణ, నాగ శ్రీనివాస్,వరప్రసాద్ ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


