క్వారీ బ్లాసింగ్‌లు నిలపాలి | - | Sakshi
Sakshi News home page

క్వారీ బ్లాసింగ్‌లు నిలపాలి

Oct 28 2025 7:46 AM | Updated on Oct 28 2025 7:46 AM

క్వారీ బ్లాసింగ్‌లు నిలపాలి

క్వారీ బ్లాసింగ్‌లు నిలపాలి

రాజవొమ్మంగి: జాతీయ రహదారి నిర్మాణ పనుల నేపథ్యంలో మండలంలోని జడ్డంగి వద్ద ఏర్పాటు చేసిన మెటల్‌ క్వారీ వద్ద బాంబు పేలుళ్లను ఆపాలని జడ్డంగి పీసా కమిటీ కార్యదర్శి తెడ్ల రాంబాబు డిమాండ్‌ చేశారు. వెంకటేశ్వర్లు అనే మేకల కాపరి సోమవారం ఈ ప్రాంతంలో జరుగుతున్న పేలుళ్లకు భయపడి పరిగెత్తుతూ కింద పడిపోయాడు. ఈ క్రమంలో వెంకటేశ్వర్లు చేతిలోని కత్తి చేయి తెగి తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని స్థానికులు జడ్డంగి పీహెచ్‌సీకు తరలించగా ప్రథధమ చికిత్స అనంతరం అడ్డతీగల ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్‌ చేశారు. మెటల్‌ క్వారీ వద్ద ప్రమాదకరమైన బ్లాసింగ్‌ ఆపాలని స్థానికులు డిమాండ్‌ చేశారు. ఈ విషయంపై పోలీసులు, సంభందిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement