తుఫాన్ దృష్ట్యా జాగ్రత్తలు పాటించాలి
ఎమ్మెల్యే మత్స్యలింగం
అనంతగిరి(అరకులోయటౌన్): తుఫాన్ హెచ్చరికల దృష్ట్యా అరకు నియోజకవర్గం ప్రజలంతా అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని, ఇళ్లలో ఉంటూ జాగ్రతలు పాటించాలని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. సోమవారం మండలంలోని చిలకలగెడ్డలో పార్టీ నాయకులతో కలిసి మాట్లాడారు. మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున్న నిత్యవసర వస్తువులతో పాటు ఇతర అవసరమైన వాటిని ముందుగా సమకూర్చుకోవాలన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు అవసరమైన ప్రాంతాల్లో సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అత్యవసర పరిస్థితిలో అరకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యలయంలో టోల్ ఫ్రీ నెంబర్లు 93815 58327, 93468 83782కు సంప్రదించాలన్నారు. సమావేశంలో ఎంపీపీ శెట్టి నీలవేణి, పార్టీ మండల అధ్యక్షుడు కొర్రా సన్యాసిరావు పాల్గొన్నారు.
ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి:
జెడ్పీటీసీ శెట్టి రోషిణి
అరకులోయ టౌన్: మండలంలోని ప్రజలంతా మోంథా తుఫాన్‌కు అప్రమత్తంగా ఉండాలని జెడ్పీటీసీ శెట్టి రోషిణి, యువజన నాయకుడు రేగం చాణిక్య అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో వారు మాట్లాడారు. మోంథా తుఫాన్ కారణంగా అతి భారీ వర్షాలు కరిసే అవకాశం ఉన్నందున ప్రజలు గెడ్డలు, వాగులు దాటవద్దన్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు సహాయక చర్యల్లో పాల్గొనాలన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి విశాఖ జిల్లా ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్, మండల పార్టీ అధ్యక్షుడు స్వాభి రామూర్తి పాల్గొన్నారు.
తుఫాన్ దృష్ట్యా జాగ్రత్తలు పాటించాలి


