
జేసీ అభిషేక్ గౌడకు వీడ్కోలు
ఘనంగా సత్కరించినజిల్లా అధికార యంత్రాంగం
సాక్షి,పాడేరు: ఏలూరు జాయింట్ కలెక్టర్‌గా బదిలీపై వెళుతున్న జేసీ డాక్టర్ ఎంజే అభిషేక్‌గౌడను జిల్లా అధికార యంత్రాంగం గురువారం ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికింది. కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్, ఇన్‌చార్జి జేసీ, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, డీఎఫ్‌వో సందీప్‌రెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ మెహిత్, డీఆర్వో పద్మలత అభిషేక్‌గౌడను సత్కరించి జ్ఞాపిక అందజేశారు. ఏడాదిపాటు జేసీ, ఏడు నెలలు ఇన్‌చార్జి పీవోగా ఆయన గిరిజనుల సంక్షేమానికి ఉత్తమ సేవలు అందించారని కలెక్టర్ దినేష్‌కుమార్ కొనియాడారు. సన్మాన గ్రహీత అభిషేక్‌గౌడ మాట్లాడుతూ అందరి సహకారంతో గిరిజన ప్రాంతంలో సేవలు అందించడం సంతోషంగా ఉందన్నారు.