
చిరుధాన్యాల సాగుతో లాభాలు
జి.మాడుగుల: చిరుధాన్యాల సాగుతో లాభాలు పొందవచ్చని భారతీయ చిరుధాన్యాల సంస్థ (హైదరాబాద్), ఐఐఎంఆర్ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ సంగప్ప, డాక్టర్ రఫి చెప్పారు. మండలంలోని సొలభం పంచాయతీలో భీమలోయి గ్రామంలో చిరుధాన్యాల పంటలను వారు బుధవారం పరిశీలించారు. మత్స్యదేవత ఎఫ్‌పీవో ఆధ్వర్యంలో భారతీయ చిరుధాన్యాల సంస్థ (హైదరాబాద్) అందించిన విత్తనాలతో సాగుచేస్తున్నట్టు రైతులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయా శాస్త్రవేత్తలు చిరుధాన్యాల పంటల సాగుపై రైతులకు పలు సూచనలు, సలహాలిచ్చారు. శ్రీ మత్స్యదేవత ఎఫ్‌పీవో సీఈవో ఐసరం హనుమంతరావు, అకౌంటెంట్, డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.