
పెద్దాస్పత్రి కిటకిట
సాక్షి,పాడేరు: స్థానిక జిల్లా సర్వజన ఆస్పత్రి రోగులతో రద్దీగా మారింది.బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లా ఆస్పత్రికి అనేక ప్రాంతాల నుంచి రోగులు వైద్యసేవలకు భారీగా తరలివచ్చారు.ఓపీతో పాటు వైద్యుల గదులు, రక్తపరీక్షలు, మందుల విభాగాలు రోగులతో కిటకిటలాడాయి. పీహెచ్‌సీల్లో వైద్యులంతా సమ్మెలో ఉండడంతో వైద్యుల పరీక్షలు నిలిచిపోయాయి. దీంతో పీహెచ్‌సీల నుంచి కూడా రిఫరల్ కేసులు సంఖ్య భారీగా పెరిగింది. ఆస్పత్రికి వచ్చిన వారిలో జ్వరాలతో బాధపడే వారే అధికంగా ఉన్నారు. వీరంతా రక్తపరీక్షలకు గంటల తరబడి క్యూలెన్‌లో నిల్చోవాల్సి వచ్చింది.సాయంత్రం వరకు 700 మంది రోగులకు వైద్యసేవలు కల్పించగా, 330 మంది ఇన్‌పేషెంట్లుగా వైద్యం పొందుతున్నారు.