సైబర్‌ నేరాలపై అవగాహన అవసరం | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ నేరాలపై అవగాహన అవసరం

Oct 16 2025 6:01 AM | Updated on Oct 16 2025 6:01 AM

సైబర్‌ నేరాలపై అవగాహన అవసరం

సైబర్‌ నేరాలపై అవగాహన అవసరం

రంపచోడవరం: సైబర్‌ నేరాలపై విద్యార్థులు పూర్తి స్ధాయిలో అవగాహన కలిగి ఉండాలని గ్రామాల్లో వీటి మోసాలపై చైతన్యం కలిగించాలని రంపచోడవరం డీఎస్పీ సాయిప్రశాంత్‌ అన్నారు. రంపచోడవరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం సైబర్‌ నేరాలు, సైబర్‌ సెక్యూరిటి , ఉమెన్‌ సెఫ్టీపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీఎస్పీ సాయి ప్రశాంత్‌ మాట్లాడుతూ సైబర్‌ నేరాల్లో భాగంగా లోన్‌ యాప్‌లు, ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌. ఓటీపీ ఫ్రాడ్‌, ఆన్‌నౌన్‌ లింక్‌లు, ఏఐ ఆధారిత సైబర్‌ మోసాలు గురించి వివరించారు. మహిళలు అపరిచిత వ్యక్తులతో ఆన్‌లైన్‌ చాటింగ్‌ , వీడియో కాల్స్‌ వంటివి చేయవద్దని సూచించారు. సీఐ సన్యాసినాయుడు, ఎస్‌ఐ వెంకటరావు, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.వసుధ, పీఎస్‌ఐ రాజ్‌కోటి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement