
సరిహద్దు పండగ.. మన్యంకొండ జాతర
ఇక్కడికి సమీపంలోని ఒడిశాకు చెందిన మన్యం కొండ గ్రామం ఆధ్యాత్మికంగా గుర్తింపు పొందింది. ఈ ప్రాంతంలో మూడేళ్లకోసారి జరిగే మన్యంకొండ జాతర ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ప్రసిద్ధి చెందింది. కొండ గుహలో పోతురాజు, బాలరాజు, కన్నమరాజు దేవతామూర్తులు కొలువుదీరారు. మూడేళ్లకోసారి వీరి ఉత్సవ విగ్రహాలను బయటకు తీసుకువచ్చి జాతర నిర్వహిస్తారు. మన్యంకొండనుంచి భారీ ఊరేగింపుతో సీలేరు నదిని దోనైపె దాటించి పొల్లూరు జలపాతం వద్దకు తీసుకువెళ్లి మంగళస్నానం చేయిస్తారు. ఈ సమయంలో దర్శనమిచ్చే బంగారు చేపకు నమస్కరించుకుంటారు. గిరిజన సంప్రదాయ ప్రకారం నవంబర్, డిసెంబర్ నెలల్లో తేదీ నిర్ణయించి పండగ జరిపిస్తారు. మల్కన్‌గిరి కలెక్టర్ ఆధ్వర్యంలో జాతర జరుగుతుంది. ఇరు రాష్ట్రాల్లో సరిహద్దు ప్రాంతాలకు చెందిన భక్తులు భారీగా తరలివచ్చి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.
దేవతామూర్తులను పడవపై సీలేరు నదిని దాటిస్తున్న మన్యం కొండ గిరిజనులు (ఫైల్)