
ఘాట్‌లో వాహనం బోల్తా
● పర్యాటకుల్లో ఇద్దరికి తీవ్ర గాయాలు
చింతూరు: మారేడుమిల్లి, చింతూరు ఘాట్‌రోడ్‌లో ఆదివారం ట్రావెల్స్ వాహనం బోల్తాపడిన ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కాకినాడలోని ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన 15 మంది విహారయాత్రకు చింతూరు వైపు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఘాట్‌రోడ్‌లోని కనకదుర్గ గుడి సమీపంలో వారు ప్రయాణిస్తున్న ట్రావెల్స్ వాహనం అదుపుతప్పి పక్కనేఉన్న కల్వర్టులో పడిపోయింది. ఈ ఘటనలో దువ్వా మనోజ్, అయినూరి శ్రీనివాసరావుకు తీవ్రగాయాలు కాగా అటుగా వెళ్తున్న ప్రయాణికులు వీరిని గమనించి చింతూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మిగతా వారికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. కాగా మనోజ్ పరిస్థితి విషమంగా ఉండటంతో రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలించారు.