
అడ్డతీగల చేరుకున్నధర్మ ప్రచార రథం
అడ్డతీగల: ప్రముఖ దేవస్థానం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ధర్మ ప్రచార రథం ఆదివారం అడ్డతీగల చేరుకుంది. పవనగిరి క్షేత్ర వ్యవస్థాపకుడు తణుకు వెంకటరామయ్య ఆధ్వర్యంలో భక్తులు స్వాగతం పలికారు. పరిసర గ్రామాల్లో పర్యటించిన రథం వద్దకు ప్రజలు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సత్యదక్షలు చేపట్టే భక్తులకు దేవస్థానం ఈవో సుబ్బారావు దీక్షా వస్త్రాలను ఉచితంగా అందజేస్తారని వెంకటరామయ్య తెలిపారు. దీక్షా వస్త్రాలు, మాలధారణ భక్తులు భక్తులు ఆధార్ కార్డు తీసుకురావాలన్నారు.