
వైద్యకళాశాలల ప్రైవేటీకరణపై ఉద్యమం
అడ్డతీగల: వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయంపై వైఎస్సార్‌సీపీ నిర్వహిస్తున్న పోరాటానికి ప్రజలంతా కలసి రావాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్సీ అనంత బాబు, రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి పిలుపునిచ్చారు. కోటి సంతకాల సేకరణ పోస్టరును మండలంలోని ఎల్లవరంలో ఆదివారం వారు ఆవిష్కరించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పోస్టర్ ఆవిష్కరణ ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. పేద వాడికి వైద్య విద్యను దూరం చేసే కూటమి ప్రభుత్వ కుట్రలను అన్ని వర్గాల ప్రజలు తిప్పికొట్టాలన్నారు. కూటమి ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలను వ్యతిరేకించకుంటే భవిష్యత్‌లో వైద్య విద్యతో పాటు వైద్య సేవలు మరింత భారంగా మారుతాయన్నారు. అంతేకాకుండా పేదలకు వైద్య విద్య దూరం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాలకు చెందిన వైఎస్సార్‌సీపీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పోరాటానికి ప్రజలు కలసి రావాలి
ఎమ్మెల్సీ అనంతబాబు, మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి పిలుపు
ఎల్లవరంలో కోటి సంతకాల పోస్టర్ ఆవిష్కరణ