
కూలిన పాఠశాల రేకుల షెడ్డు
● పక్కా భవనం నిర్మించాలని బలపం సర్పంచ్ రమేష్‌నాయుడు డిమాండ్
చింతపల్లి: మండలంలో లవడంపల్లిలో కొద్దిరోజులక్రితం పాఠశాల రేకుల షెడ్డు కూలిపోయింది. ఈ సమయంలో విద్యార్థులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సుమారు 15 ఏళ్ల క్రితం గ్రామంలో ఏర్పాటుచేసిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు పక్కా భవనం లేదు. ఇక్కడ 20 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వసతి సమస్య నెలకొనడంతో గ్రామస్తులు రేకులతో షెడ్డు నిర్మించారు. అప్పటినుంచి అందులోనే తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గాలివానకు రేకులషెడ్డు కూలిపోయింది. ఈ సమయంలో విద్యార్థులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. వసతి లేని కారణంగా ఓ చిన్న ఇంటి ప్రాంగణంలో బోధన నిర్వహిస్తున్నారు. అధికారులు స్పందించి పక్కా భవనం మంజూరు చేయాలని బలపం సర్పంచ్ రమేష్‌నాయుడు, గ్రామస్తులు కోరుతున్నారు.