
వైభవంగా దేవీ శరన్నవరాత్రులు
చింతపల్లి: మండలంలో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా దుర్గమ్మ ఆదివారం మహా చండీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. మండల కేంద్రంలో హైస్కూల్ జంక్షన్, అనాదీశ్వర ఆలయంతో పాటు బైలుకించంగి రోడ్డువీధి, రత్నగిరి కాలనీలో ఏర్పాటు చేసిన దుర్గమ్మతల్లి మండపాల్లో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.చింతపల్లిలో జగన్ పంతులు కుంకుమ పూజలు, అబిషేకాలు జరిపించారు.
గంగవరం : మండల కేంద్రంలోని రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆదివారం అమ్మవారికి కుంకు పూజలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు.
మోతుగూడెం: దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా పొల్లూరులోని దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఆదివారం భక్తులు రమేష్, రమాదేవి భవానీ దంపతులు అమ్మవారికి సారె వితరణ చేశారు. గ్రామస్తులు ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకుని సారేను సమర్పించారు. అర్చకుడు అయినవిల్లి కుమారస్వామి శర్మ అమ్మవారికి అలంకరణ చేసి పూజా కార్యక్రమం నిర్వహించారు.

వైభవంగా దేవీ శరన్నవరాత్రులు

వైభవంగా దేవీ శరన్నవరాత్రులు