
విశాఖ జూలో కూనల కనువిందు
ఆరిలోవ: ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కులో వన్యప్రాణుల సంతానోత్పత్తి కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. మూడు నెలల కిందట పలు జంతువులు, పక్షులు పిల్లలకు జన్మనివ్వగా, తాజాగా మరికొన్ని వన్యప్రాణులకు పిల్లలు పుట్టాయి. ఇటీవల జూలో రెండు చౌసింగాలు (ఒక మగ, ఒక ఆడ), ఒక మగ కృష్ణ జింక పిల్ల, రెండు బ్లూ గోల్డ్ మకావ్ పక్షులు జన్మించాయని జూ క్యూరేటర్ జి. మంగమ్మ ఆదివారం తెలిపారు. తల్లీపిల్లలు అన్నీ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం చౌసింగా, కృష్ణ జింక పిల్లలు వాటి ఎన్‌క్లోజర్‌లలో తల్లుల చెంత ఉత్సాహంగా ఆడుకుంటూ సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి.

విశాఖ జూలో కూనల కనువిందు