
బెర్రీ బోరర్ ఆశించిన కాఫీ తోటల పరిశీలన
అరకులోయ టౌన్ : మండలంలోని చినలబుడు పంచాయతీ పరిధిలో రైతులు సాగు చేస్తున్న కాఫీ తోటలను ఆదివారం ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పరిశీలించారు. గిరిరైతులతో కలిసి బెర్రీబోరర్ పురుగు ఆశించిన కాఫీ పిందెలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీలు ఆర్థిక ఎదుగుదలకు కాఫీ, మిరియం పంటలు ప్రధానమన్నారు. కాఫీ పండ్లకు బోర్రీబోరర్ పురుగు సోకడంతో గిరి రైతులు తీవ్ర నష్టపోతారన్నారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో ప్రభుత్వం మద్దతు ధర కల్పించాలన్నారు. కాఫీ రైతులకు వైఎస్సార్‌సీసీ అండగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు స్వాభి రామ్మూర్తి, అరకు బూత్ కమిటీ ఇన్‌చార్జులు పాంగి విజయ్ కుమార్, బోయి కిరణ్ కుమార్, వైఎస్సార్‌సీపీ పంచాయతీ కమిటీ అధ్యక్షుడు లొక్కోయి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
మద్దతు ధర ప్రకటించి ఆదుకోవాలనిఅరకు ఎమ్మెల్యే మత్స్యలింగం డిమాండ్