
రేషన్ దూరం.. పేదలకు భారం
సాక్షి.పాడేరు: జిల్లాలో రేషన్ సరుకులు పొందేందుకు కార్డుదారులు నరకం చూస్తున్నారు. మారుమూల గ్రామాల గిరిజనుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గిరిజనులకు ఇంటింటికి బియ్యం, ఇతర నిత్యావసరాలను ఎండీయూ వాహనాల ద్వారా పంపిణీ చేసేది. ప్రతి నెలా మొదటి వారంలోనే రేషన్‌కార్డుదారులు సరకులు పొందేవారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారుంలోకి వచ్చిన తరువాత పేదలకు కష్టాలు మొదలయ్యాయి. ఎండీయీ వ్యవస్థను రద్దు చేసింది. దీంతో రేషన్‌కార్డుదారులు దూరంగా ఉన్న డీఆర్ డిపోలకు వెళ్లాల్సి వస్తోంది. ఎండీయూ వ్యవస్థ రద్దు ప్రభావం గిరిజన ప్రాంతాలపై తీవ్రంగా ఉంది. ఈ ఏడాది జూన్ నుంచి గిరిజనులు రేషన్ బియ్యం, ఇతర నిత్యావసరాలు పొందేందుకు నరకం చూస్తున్నారు.
● జిల్లాలో ఇంటి వద్దే సరకులు పొందేందుకు అలవాటు పడిన రేషన్‌కార్డుదారులు కూటమి ప్రభుత్వం పుణ్యామాని సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాళ్లరిగేలా డీఆర్ డిపోల చుట్టూ తిరుగుతూ నరకం చూస్తున్నారు.
● ప్రతి డీఆర్ డిపో పరిధిలోని గ్రామాలు రెండు నుంచి ఏడు కిలోమీటర్ల దూరం వరకు ఉంటున్నాయి. అంత దూరం నుంచి గంటల తరబడి నడిచి డిపోలకు వస్తున్నారు. అక్కడ సరకులు పొందేందుకు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని వారు వాపోతున్నారు.
● డిపోల నుంచి బియ్యం,ఇతర సామగ్రిని గ్రామాలకు మోసుకువెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రవాణా సౌకర్యాలు అంతంతమాత్రంగా ఉండడంతో మారుమూల గ్రామాల గిరిజనులు ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది. లగేజీతో కలిపి ఒకొక్కరికి రూ.50 నుంచి రూ.70 రవాణా నిమిత్తం చెల్లించాల్సి వస్తోంది. ఎండీయూ వ్యవస్థను రద్దు చేసిన కూటమి ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కొత్త డిపోల ఊసెత్తని కూటమి ప్రభుత్వం
జిల్లాలోని 22 మండలాల పరిధిలో 352 గ్రామసచివాలయాలకు సంభందించి 5108 గ్రామాలు ఉండగా, 671 రేషన్‌డిపోలు పనిచేస్తున్నాయి.గ్రామాల సంఖ్యకు తగ్గట్టుగా రేషన్‌డిపోలు లేకపోవడంతో గిరిజనులంతా ఇబ్బందులు పడుతున్నారు.ప్రతి డిపో పరిధిలోను 20నుంచి 30వరకు గ్రామాలు ఉంటున్నాయి,వాటిలో అధికంగా మారుమూల గ్రామాలే కావడంతో నడక ఇబ్బందులు తప్పడం లేదు.గ్రామాల సంఖ్య.మారుమూల గ్రామాలను పరిగణలోకి తీసుకుని కొత్త రేషన్‌డిపోల ఏర్పాటును కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గిరిజనులు మండిపడుతున్నారు.
కార్డుదారులకు నరకం చూపిస్తున్న కూటమి ప్రభుత్వం
డిపోల వద్ద గంటల తరబడి పడిగాపులు
దూరాభారంతో ఇబ్బందులు
ఎండీయూ వ్యవస్థ తొలగింపుతో కష్టాలు
నాలుగు నెలలుగా ఇదే దుస్థితి
ప్రతి నెలా ఇబ్బందులు
ప్రభుత్వం ఎండీయూ వ్యవస్థను రద్దు చేసి చాలా అన్యాయం చేసింది. గ్రామాల నుంచి దూరంగా ఉన్న డిపోలకు కాలినడకన వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. గతంలో జగనన్న ప్రభుత్వం బియ్యం బండిని ఇంటి దగ్గరకే వంపేది. కాలినడక కష్టాలు ఉండేవి కావు. ఇప్పుడు మళ్లీ పాత పద్ధతిలో గుత్తులపుట్టు డీఆర్ డిపోకు కాలినడకన వెళ్లి చాలా సమయం నిరీక్షించి బియ్యం తెచ్చుకునేందుకు నరకం చూస్తున్నాం.
– కిల్లో జ్యోతి, కొత్తపల్లి, పాడేరు మండలం

రేషన్ దూరం.. పేదలకు భారం

రేషన్ దూరం.. పేదలకు భారం

రేషన్ దూరం.. పేదలకు భారం