
లేప్రోస్కోపీ శస్త్ర చికిత్సలు ప్రారంభం
పాడేరు : స్థానిక ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో లేప్రోస్కోపీ శస్త్ర చికిత్సలు ప్రారంభించామని వైద్య కళాశాల ప్రిన్సిపాల్, ఇన్‌చార్జి సూపరిండెండెంట్ డాక్టర్ హేమలత వెల్లడించారు. క్యాన్సర్, పేగునొప్పి, థైరాయిడ్ ఆపరేషన్లతో పాటు లేప్రోస్కోపి ద్వారా అపెండిసైటిస్ (కడుపు నొప్పి) సర్జరీలు స్థానిక జిల్లా ఆస్పత్రిలోనే నిర్వహిస్తామని ఆమె వివరించారు. ఇకపై రోగులు ఆపరేషన్ల కోసం విశాఖపట్నంలోని కేజీహెచ్, ఇతర ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. గిరిజన ప్రాంతంలో రోగులకు సకాలంలో నాణ్యమైన వైద్య చికిత్సలు అందించేందుకు తమ వైద్య బృందం సిద్ధంగా ఉందన్నారు. ఈ సేవలను రోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. తొలి ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసిన లేప్రోస్కోపీ విభాగాఽధిపతి డాక్టర్ శ్రీనివాసరావు, ఎనష్తీషియా విభాగాధిపతి డాక్డర్ సతీష్‌బాబు, వైద్య బృందం సభ్యులు డాక్టర్ రత్నకిషోర్, డాక్టర్ రమేష్‌కుమార్, డాక్టర్ విజయ్, డాక్టర్ అనూప్‌లను ఆమె అభినందించారు. ఇదే స్ఫూర్తితో జిల్లా ఆస్పత్రిలో మరిన్ని శస్త్ర చికిత్సలు విజయవంతంగా పూర్తి చేయాలని ఆమె కోరారు.
మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా ఆస్పత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్ హేమలత