
మచ్చ తెగుళ్ల లక్షణాలివీ..
● మొక్కల ఆకులపై చిన్న చిన్న పసుపు రంగు మచ్చలు ఏర్పడి అవి క్రమేపీ గోధుమ రంగులోకి మారి ఎండిపోతాయి. ఈ తెగులు కింద ఆకుల నుంచి పైకి వ్యాప్తి చెందుతుంది. దీనికి ఆకుమచ్చ తెగులుగా గుర్తించి వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. నవంబర్– డిసెంబర్ నెలలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీని విషయంలో రైతులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి.
● ఆకులపై అండాకారంలో పెద్ద మచ్చలు కనిపిస్తే తాటాకు మచ్చ తెగులుగా గుర్తించాలి. ఇవి ముదురు గోధుమ వర్ణంలో ఉంటాయి. ఆకు కాడపై మచ్చలు ఏర్పడటంతో ఆకు కిందకు వాలిపోతుంది. ఈదురు గాలులతో కూడిన వర్షాలు, గాలిలో తక్కువ తేమ, ఉష్ణోగ్రతలు ఈ తెగులు వ్యాప్తికి దోహదపడతాయి. సెప్టెంబర్ నుంచి ఈ తెగులు ప్రభావం పైరుపై కనిపిస్తుందని శాస్‌త్రవేత్తలు సూచిస్తున్నారు.
పసుపు సాగులో ఏజెన్సీ వాతావరణానికి అనువైన ఆధునిక వంగడాలు అందుబాటులో ఉన్నప్పటికీ గిరి రైతులు దేశవాళీ రకం వైపే మొగ్గు చూపుతున్నారు. అధిక దిగుబడినిచ్చే రోమా రకాన్ని శాస్త్రవేత్తలు పరిచయం చేసినా ఆసక్తి చూపడం లేదు. మెట్ట, పోడు భూముల్లో దేశవాళీ రకం సాగుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
చింతపల్లి: ఏజెన్సీలో గిరి రైతులకు ప్రధాన ఆదాయ వనరుల్లో కాఫీ మాదిరిగానే పసుపు సాగు కీలకం. ఏటా సాగు చేస్తున్న పంటలో కొంతమేర పసుపు దుంపను భద్రపరిచి విత్తనంగా వినియోగించడం ఆనవాయితీగా వస్తోంది. దీనివల్ల విత్తన ఖర్చు తగ్గుతోందని గిరి రైతులు చెబుతున్నారు.
● పాడేరు డివిజన్ పరిధిలో సుమారు 24 వేల హెక్టార్లలో పసుపు పంటను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు పైరుకు అనుకూలంగా ఉన్నప్పటికీ తెగుళ్ల సోకే అవకాశం కూడా లేకపోలేదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని ఉద్యానవన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఈ ఏడాది మార్చి నెలలో సాగు చేపట్టారు. పైరు ఎదుగదల బాగానే ఉంది. అయితే ప్రస్తుతం వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి.
● దేశవాళీ రకాలను కూడా ఏడాది పంటగా సాగు చేయడం వల్ల మంచి దిగుబడులు ఆదాయం పొందవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అలాకాకుండా రెండేళ్ల పంటగా సాగు చేయడం వల్ల రెండో ఏడాది గణనీయంగా దిగుబడులు తగ్గిపోతున్నాయి.

మచ్చ తెగుళ్ల లక్షణాలివీ..