
ఊపందుకున్న ఏరువాక పనులు
జి.మాడుగుల: అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ఏరువాక పనులు ఊపందుకున్నాయి. 17 పంచాయతీలు, 217 రెవెన్యూ గ్రామాలు, 11,245 రైతులు ఉన్నారు. మండల వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో ఈ ఖరీఫ్ సీజన్‌లో 8,743 హెక్టార్లుల్లో వరి పంట వేయటానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం వాతావరణం అనుకూలించడంతో గ్రామాల్లో దుక్కిటెడ్లు, యంత్రాలతో దుక్కు పనులు చేపట్టి వరి పంట సాగుకు పొలాలను సిద్ధం చేస్తున్నారు. గెడ్డలు, వాగులు, చెక్‌డ్యామ్‌లు, చెరువులు, పంటకాల్వలు కింద ఆయకట్టు భూముల్లో వరి నాట్లు వేసే పనులు గిరిజన రైతులు ముమ్మరం చేశారు. విస్తారంగా వర్షాలు కురుస్తుడడంతో సాగునీటి కష్టాలు ఉండవని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.వరి ఇతర పంటలు వేసుకోవటానికి వ్యవసాయ అధికార, సిబ్బంది సలహాలు, సూచనలు అందస్తున్నారు. దీంతో ఈ సీజన్‌లో అధిక పంట దిగుబడులు సాధించటానికి రైతులు దృష్టి సారించారు. మండలంలో ఆదివాసీ రైతులకు 90శాతం సబ్సీడీపై వరి విత్తనాలు, పచ్చిరొట్ట ఎరువులు(జీలుగు) పంపిణీ చేశారు. మండలంలో 100శాతం సబ్సీడీపై 315రాగి(చోళ్లు)విత్తనాల కిట్లును గిరిజన రైతులకు అందజేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో వరితో పాటు చిరుధాన్యాలు రాగులు, కొర్రలు, సామలు పంటలకు అనుకూలమని వ్యవసాయశాఖ అధికారి, సిబ్బంది రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.

ఊపందుకున్న ఏరువాక పనులు

ఊపందుకున్న ఏరువాక పనులు