
ఆర్‌ఐటీఐ కౌన్సెలింగ్‌కు 150 మంది హాజరు
వివిధ ట్రేడ్లలో 123 మంది ప్రవేశాలు
చింతపల్లి: మండల కేంద్రంలో నివాస అనుబంధ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఆర్‌ఐటీఐ)లో రెండవ విడత కౌన్సెలింగ్‌కు 150 మంది విద్యార్థులు హాజరైనట్లు ప్రిన్సిపాల్ రమణ తెలిపారు. తొలి విడతలో మిగిలిన ీ149 సీట్లకు 308 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. వీరిలో బుధవారం నిర్వహించిన రెండో విడత కౌన్సెలింగ్‌కు 150 మంది వచ్చినట్టు ఆయన వివరించారు. వీరిలో 123 మంది వివిధ ట్రేడ్లలో ప్రవేశాలు పొందారన్నారు. ఇంకా 26 సీట్లు మిగిలి ఉన్నాయన్నారు. ప్లంబర్, కార్పెంటర్ ట్రేడ్‌ల్లో సీట్లు ఖాళీ ఉన్నాయన్నారు. వీటి భర్తీకి గురువారం కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ప్రిన్సిపాల్ తెలిపారు.