
సీఆర్‌పీఎఫ్ డీఐజీ తనిఖీలు
వై.రామవరం: స్థానిక పోలీసు స్టేషన్ ఆవరణలో ఉన్న సీఆర్‌పీఎఫ్ జి42 బెటాలియన్ అదనపు పోలీసు బలగాల క్యాంపులో సీఆర్‌పీఎఫ్ డీఐజీ ఎస్. అరుల్ కుమార్ శనివారం సందర్శించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దీనిలో భాగంగా భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. సిబ్బందికి కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు. విధుల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సిబ్బంది నివాస గృహాలను, బ్యారక్‌ను, సెంట్రీ పోస్టులను పరిశీలించారు. మావోయిస్టుల కదలికలు, తదితర అంశాలపై ఆరా తీశారు. అవసరమైన సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. అనంతరం సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఆర్‌పీఎఫ్ కమాండెంటు ధర్మప్రకాష్, సెకండెంటు కమాండెంటు మహేంద్ర హెగ్డే, డీఎస్పీ ఎం.రాధ, ఎస్‌ఐ బి. రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.