
ప్లాస్టిక్ కాలుష్య నివారణ అందరి బాధ్యత
జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ
పాడేరు : ప్లాస్టిక్ కాలుష్య నివారణ అందరి బాధ్యత అని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ అన్నారు. శనివారం పాడేరు పట్టణంలో స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్రపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని పాత బస్టాండ్ నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలన్నారు. ఏజెన్సీలో వారపు సంతలు, పర్యాటక ప్రదేశాల్లో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల వినియోగం పూర్తిగా తగ్గించాలన్నారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల నీటి వనరులు పూర్తిగా కలుషితం అవుతాయన్నారు. తద్వారా రోగాలు ప్రబలుతాయన్నారు. పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు ప్లాస్టిక్ నిషేధానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ కనల చిరంజీవి నాగ వెంకట్ సాహిత్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ టి.విశ్వేశ్వరనాయుడు, డీఎల్‌పీవో పీఎస్ కుమార్, వైద్యాధికారులు, వైద్య సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
జాయింట్ కలెక్టర్ దినేష్‌కుమార్