
గంజాయి తరలిస్తున్న ముగ్గురి అరెస్టు
చింతూరు: ఒడిశా నుంచి తెలంగాణకు అక్రమంగా గంజాయిని తరలిస్తున్న తెలంగాణకు చెందిన ముగ్గురు వ్యక్తులను శనివారం చింతూరు పోలీసులు పట్టుకున్నారు. వారినుంచి రూ 25 వేల విలువైన ఐదు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చింతూరు ఎస్‌ఐ రమేష్ తెలిపారు. స్థానిక పోలీసుస్టేషన్ ఎదుట వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో అనుమానాస్పదంగా తారసపడిన కారును ఆపి సోదాచేయగా ఐదుకిలోల గంజాయి లభ్యమైనట్లు ఆయన వివరించారు. గంజాయి రవాణాకు పాల్పడుతున్న తెలంగాణకు చెందిన మాలోతు సాయినాఽథ్, నోమలు రామకృష్ణ, వేల్పుల రామును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.