
గిరిజన విద్య పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం
ముంచంగిపుట్టు: మండలంలోని మాకవరం పంచాయతీ లబుడుపుట్టు జీసీఎస్ పాఠశాలకు పక్కా భవనం మంజూరు చేయాలని గిరిజన సంఘ మండల అధ్యక్షుడు ఎంఎంశ్రీను డిమాండ్ చేశారు. శనివారం లబుడుపుట్టు గిరిజన సంఘ నేతలు పర్యటించారు. ,పాకలో నిర్వహిస్తున్న పాఠశాలను చూసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. పాఠశాలకు భవనం లేక పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీను మాట్లాడుతూ ప్రభుత్వం, విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. చదువు కునే పాఠశాలకు భవనం లేకపోవడం దారుణమన్నారు. ,గిరిజన విద్య పట్ల కూటమి ప్రభుత్వం చిన్నచూపు తగదని, 32 మంది గిరిజన విద్యార్థులు ప్రతి రోజు భవన వసతి సమస్యను ఎదుర్కొంటున్నారన్నారు. తక్షణమే పాఠశాల భవనం మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
గిరిజన సంఘ మండల అధ్యక్షుడు
శ్రీను విమర్శ
పాఠశాలకు భవనం లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని ఆవేదన