
ప్రకృతి సాగుతో అధిక దిగుబడి
ముంచంగిపుట్టు: మండలంలోని ఏనుగురాయి పంచాయతీ చోటముఖిపుట్టు గ్రామంలో మండల వ్యవసాయాధికారి మురళీకృష్ణ ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి సాగుతో అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. నాట్లు వేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. వరి పంట పొలంలో మూడు ఎకరాల్లో వరినాట్లు వేసే వరస పద్ధతిపై తెలియజేస్తూ నాట్లు వేశారు. తెగుళ్లు ఉధృతి నివారించవచ్చన్నారు. వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది, మొక్క ఎంతో దృఢంగా పెరుగుతుందని, దిగుబడి వస్తుందని చెప్పారు. ప్రకృతి వ్యవసాయం ఆర్గనైజర్ ఆనంద్, వ్యవసాయశాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.